మీరు కూడా నాలా మంటనక్క (గుంట నక్క కాదు) వాడుతున్నారా?
మంటనక్క అంటె ఏంటి అని కంగారు పడుతున్నారా? ఏమి లేదండి, Firefoxకి కొంచెం తెలుగుదనం అద్దాను అంతె. సరే, అసలు విషయానికి వస్తాను.
ముందే చెప్పుకున్నట్టు మంటనక్కని వాడుతున్నట్లయితే మీరు username, password save చేసే ముందు కొంచెం ఆ
లోచించండి. ఎందుకంటే ఒక సారి save చేస్తే ఆ username, password ని తెలుసుకోవడం చాలా ఈజీ. ఎలా అంటె ….
ఒక వేల మీకు ముందే తెలిస్తే ఈ టపా మీ కోసం కాదు. ఇది తెలియని వారి కోసమే. తెలిసిన తర్వాత ఓహ్, ఇంతేనా అనిపిస్తుంది.
1. firefox లో tools->options ని నొక్కండి.
2. ఇప్పుడు security tab మీద నొక్కండి.
3. ఇప్పుడు ‘Saved passwords’ మీద నొక్కండి.
4. ఇప్పుడు మీ system లో సేవ్ చేసిన అన్ని websites వివరాలు కనిపిస్తాయి.
5. ఇప్పుడు “show passwords” మీద క్లిక్ చెయ్యండి.
అంతే, మీరు ఎంతో జాగ్రతగా భద్రపరుచుకున్న passwords కనిపిస్తాయి. చాలా వీజీ కదా !!
ఒక వేల మీ కంప్యూటర్ ని మీరు మాత్రమె కాకుండా వేరే వాళ్ళు కూడా ఓపెన్ చేస్తే వాళ్ళ passwords మీరు చూడొచ్చు, మీ passwords వాళ్ళు కూడా చూడొచ్చు, కాబట్టి జాగ్రత్త.
ఇలా కాకుండా మీ మంటనక్కలో save చేసిన passwords ఎవరు చూడకుండా చెయ్యాలంటే master password set చేసుకోండి. దీన్ని సెట్ చేసుకుంటే firefox open చేసినప్పుడు ఎప్పుడైతే మీరు username ఎంటర్ చేస్తారో అప్పుడు master password అడుగుతుంది, అది ఒక సరి enter చేస్తే ఆ firefox close చేసేంతవరకు మళ్లీ అడగకుండా save చేసిన passwords ని ఇచ్చేస్తుంది.
దీని వలన ఇంకా వేరే ఉపయోగం ఏంటంటే, మీరు లేని సమయాన మీ కంప్యూటర్ ఎవరైనా ఉపయోగిస్తే వాళ్ళకి మీ firefox లో మీరు సేవ్ చేసిన password తో login అవ్వలేరు. master password లేకపోతే మాములుగా passwords ని ఎంటర్ చెయ్యాల్సి వుంటుంది. తెలిస్తే ఎంటర్ చేస్తారు. తెలియక పోతే వాళ్ళ credentials ఉపయోగించుకుంటారు. కాబట్టి మీరు మీ కంప్యూటర్ దగ్గర లేకున్నా మీ account లోకి వేరే వాళ్ళని enter అవుతారు అన్న భయం ఉండదు.
ఇప్పుడు మీరు నేను చెప్పిన విధానంతో ఏ నెట్ సెంటర్ లోకి అయినా వెళ్లి చూడండి, తప్పకుండ రెండు మూడు passwords తెలుస్తాయి. దయ చేసి వాటిని దుర్వినియోగం చేయకండి.
ఇంతకీ మాస్టర్ పస్స్వొర్ద్ ఎలా సెట్ చెయ్యాలంటే
1. ఫైరుఫాక్సు లో tools->options ని నొక్కండి.
2. ఇప్పుడు security tab మీద నొక్కండి.
3. “User a master password” మీద నొక్కండి.
4. ఇప్పుడు ఒక కొత్త passwor చేసుకోండి. అంతే.
5. మళ్లీ ఎప్పుడైనా change చెయ్యాలన్న ఇంతే.
ఒక సరి mastere password set చేసాక, మొదట్లో చెప్పిన విధంగా password చూడటానికి ప్రయత్నించండి.. ఇప్పుడు master password అడుగుతుంది, అది సరిగ్గా enter చేస్తేనే passwords ని చూపిస్తుంది.
♥ ♥ ♥ స్పందన - ప్రతిస్పందన ♥ ♥ ♥