ఇళయరాజా – జానకి గారి combination లో నాకు నచ్చిన ఒక పాట
ఇది మీకు కూడా నచ్చి తీరుతుంది
సినిమా: నిరీక్షణ
గీత రచయిత: ఆచార్య ఆత్రేయ
పాట: ఆకాశం ఏ నాటిదో…
ఈ పాట lyrics కావాలంటే ఇక్కడ నొక్కండి.
ఈ పాటని మనం 5-6 సార్లు continuous గా విన్న కూడా మళ్లీ వినాలనిపిస్తుంది. నాకు తెలిసి భానుచందర్ కి ఈ సినిమా మరియు సూత్రదారులులో మంచి పాటలు ఉన్నాయి. (ఇంకా వేరే ఉంటె తెలియ చెయ్యండి, విని ఆనందిస్తాను)
భానుచందర్ గారికి, మంచి మనసులు సినిమాలో “జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై” అనే ఇంకో అద్భుతమైన పాట కూడా ఉంది.
ముక్కు పుడక లో, లాయర్ సుహాసిని (భాను చందర్ అని గుర్తు మరి) కోకిల (అంత గొప్ప గా వుండవు కాని ఓకే.) లో కుడా వున్నాయి కదా మంచి పాటలు. కానీ నిరీక్షణ ను మించినవి ఏమి లేవు లే.. ఆ సినిమా నే బాలు మహెంద్ర అధ్బుతం గా గీసిన ఒక స్కెచ్.
భావన గారు, కోకిల సినిమాలో హీరో నరేష్ గారు.
ముక్కు పుడక మరియు లాయర్ సుహాసిని సినిమాల గురించి నాకు పెద్దగా తెలియదు. అందులో మంచి పాటలు చెప్తే విని ఆనందిస్తాను.
మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు.
లాయర్ సుహాసిని లో ఒక పాటని ఇప్పుడే విన్నాను. బాగుంది. ఈ సినిమాకి బాలు సంగీత దర్శకుడు.
ఈ పాట కోసం ఇక్కడ నొక్కండి.
సారీ అండీ కోకిల కాదు కీచురాళ్ళు నేను చెప్పింది, ఇళయరాజా మ్యూజిక్, గొప్ప గా వుండవని గుర్తు కాని గీత క్రిష్ణ, ఇళయరాజా ఫేం లో పడి హిట్ ఐనట్లు వున్నాయి సాంగ్స్ అప్పుడు. ఇప్పుడు అంత గా గుర్తు లేవు పాటలు. లాయర్ సుహసిని మీరు ఆల్ రడీ కనిపెట్టేరు కదా.. ముక్కు పుడక దాదాపు గా అన్ని బాగానే వుంటాయి, నిరీక్షణ తో పోటీ మాత్రం కాదు.
కీచిరాళ్ళు పాటలు ఎప్పుడో విన్నట్టుంది. మళ్లీ గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.
చాలా రోజుల తర్వాత గీతాకృష్ణ గారు ఇప్పుడు ఒక కొత్త సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పేరు కాఫీ బార్, ఈ సినిమా కూడా ఆయన అన్ని సినిమాలా వైవిధ్యంగా ఉంటుంది అని పబ్లిక్ టాక్. చూద్దాం, ఎలా ఉండబోతుందో.
jaabilli kosam aakashamalle ane song. manchi mansulu ane siniimalonidi
నెలబాలుడు గారు, కరెక్ట్ చేసినందుకు ధన్యవాదాలు.
ఇళయరాజా జానకి గారికిచ్చినన్ని మంచి పాటలు ఇంకే సంగీత దర్శకుడూ ఇవ్వలేదేమో ఆమెకు! ఆమె వాయిస్ లో వయొలిన్ లాంటి సన్నని ఇన్స్ట్రుమెంట్ కలిపి..ఎన్నెన్నో ప్రయోగాలు కూడా! జానకి గొంతులోని మాధుర్యాన్ని ఇళయరాజా స్థాయిలో ఎవరూ ఎక్స్ పోజ్ చేయలేదు.
జాబిల్లి కోసం పాట మాత్రం నాకు బాలూ వెర్షనే నచ్చుతుంది. అదే ఫేమస్ కూడా అయింది.(నచ్చింది ఫేమస్ అయినందుకు కాదండి)
నిరీక్షణలో పాటలు చాలా బాగుంటాయి. అలాగే ఆత్మ బంధువులో పాటలు కూడా జానకి పాడినవి ఎంతో స్వీట్ గా ఉంటాయి.
సుజాత గారు, నాకు కూడా బాలు వెర్షన్ నచ్చుతుంది. అందుకే ఆ వీడియో పెట్టాను
అలా అని జానకి గారిది నచ్చదని కాదు, రెండు సమానంగా నచ్చుతాయి, కానీ బాలు గారిది కొంచెం ఎక్కువ సమానం.
సుజాత, తికమక గారు ఎవరైనా కొంచం సాయం చెయ్యండి “ఆత్మ బంధువు” అంటే “మనిషి కో స్నేహం మనసు కో దాహం” ఇంకా ఇంకా అనంతమైన ఆణి ముత్యాలు వున్న సినిమా నా? శివాజీ గణేష్, రాధ.
లేక పోతే “ఒట్టేసి చెప్ప వా ఇంకొక్క సారి ఒట్టి వూహ కాదని ఈ గట్టి పూల గాలి నమ్మలేక పోతున్న కమ్మని నిజాన్ని” అనే పాట ఇంకా ఒకటో రెండో అధ్బుతమైన పాటలు వుంటాయి సుమన్ అండ్ ఎవరో అమ్మాయి ఆ సినిమానా ??
భావనా,
నేను చెప్పింది శివాజీ గణేశన్,రాధల సినిమానే! అందులో అద్భుతమైన పాటలు ఉన్నాయి. “పట్టి తెచ్చానులే పండు ఎన్నెల్ని నేనే” పాట జానకి ఎంత చిలిపిగా ఎంత బాగా పాడారో చెప్పలేను. అలాగే “మూగైన హృదయమా” పాట కూడా బావుంటుంది చాలా!
రెండో సినిమా పేరు “ఆత్మ బంధం” అని గుర్తు! సుమన్, లిజీ! ఈ సినిమాకి పాట్రిక్ స్వేజ్, డెమీ మూర్ ల ఘోస్ట్ సినిమా ఆధారం! ఇందులో “ఒట్టేసి చెప్పనా” పాడింది చిత్ర!
తికమక గారు, “బాలు గారిది కొంచెం ఎక్కువ సమానం…… “భలే చెప్పారు. నా ఫీలింగ్ కూడా ఇదే!
నైస్ థ్యాంక్స్ సుజాత, అవును ఆత్మ బంధువు లో పాటలు చాలా బాగుంటాయి, అంటే నేను బాలు ని అస్సలు అవమానించాలని కాదు కాని ఆ పాటలు తమిళ్ సినిమా లో ఎవరో పాడతారు అర్ధం తెలియక పోయినా ఆ గొంతు.. బాలు కంటే కూడా బాగుంటుంది పక్కా పల్లెటూరి యాస తో భాష తెలియక పోయినా ఆ మధురిమ అలవోక గా అర్ధం చేస్తుంది.. వో ఆత్మ బంధం లో చిత్ర నా పాడింది..
భావనా, తమిళ్ లో మూగైన హృదయమా పాడింది సౌందర రాజన్ గారు!
no sujatha garu, it is malaysia vasudevan